ఆదిలాబాద్‌టౌన్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో అక్టోబర్‌లో తెలంగాణ రాష్ట్రస్థాయి జానపద సాంస్కృతి క జాతర నిర్వహించనున్నట్లు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్రస్థాయి సిల్వర్–గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ తెలిపారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శా ఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందించడంతోపా టు వాటిని పరిరక్షించేందుకు జానపద సాంస్కృతిక జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జానపద, భజన, బతుకమ్మ ఆట పాటలు, డప్పు నృత్యాలు, గ్రూప్ సాంగ్స్, ఒగ్గుకథ, ఒగ్గుడోలు, మహిళా కోలా టం, బోనాలు, బుర్రకథ, సింధు యక్షగానం తదిత ర తెలంగాణ కళారూపాల ప్రదర్శనకు కళాకారులు ఈనెల 28 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు 94409 88001 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


