ఆదిలాబాద్‌టౌన్: ఉదారి కుటుంబం చేస్తున్న సాహిత్య సేవ చాలా గొప్పదని పలువురు కవులు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం ఉదారి నాగదాసు స్మారక కవిత పురస్కారాన్ని మునిమడుగుల రాజారావుకు అందజేశారు. పలువురు కవులు హాజరై మాట్లాడారు. తత్వ కవులు కష్టాలకు భయపడి శ్రమకు, కుటుంబాలకు దూరంగా ఉండలేరని పేర్కొన్నారు. ఉదారి నాగదాసు కుటుంబం కవిత పురస్కారం అందించడం కవులను గౌరవించడమేనని అన్నారు. రాజారావుకు ప్రశంసపత్రంతోపాటు రూ.5వేల నగదు అందజేశారు. కవులు సామల వీరన్న, బాలసాని నారాయణ గౌ డ్, మన్నె ఏలియా, డైట్ కళాశాల వైస్ ప్రి న్సిపాల్ కిరణ్ కుమార్, ఉదారి నారాయణ, తొడసం చందు, చిందం ఆశన్న పాల్గొన్నారు.


