ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో శిశువులను కాపాడిన క్రమంలో అస్వస్థతకు గురైన స్టాఫ్ నర్స్ ప్రమీల ఆరోగ్య పరిస్థితి విషమించింది. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఊపిరితిత్తుల్లో నీరు నిల్వ కావడం, కెమికల్స్‌తో లీవర్‌పై ప్రభావం చూపిందని వైద్యులు పే ర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చి కిత్స పొందుతున్న ఆమెను ఎమ్మెల్యే పాయల్ శంకర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, దళిత శక్తి ప్రోగ్రాం కన్వీనర్ అగ్గిమల్ల గణేశ్‌తోపాటు పలువురు పరామర్శించారు.


