ఆ ఊళ్లో ఓటర్లందరికీ నోటీసులు | - | Sakshi
Sakshi News home page

ఆ ఊళ్లో ఓటర్లందరికీ నోటీసులు

Sep 28 2026 1:29 AM | Updated on Sep 28 2026 1:29 AM

● 2002 జాబితాలో పేర్లు లేవని జారీ ● ఓటు ఉంటుందా, పోతుందా అని గ్రామస్తుల ఆందోళన

ఈ ఫొటోలోని వ్యక్తిపేరు నాగవత్‌ రాజు నాయక్‌. చెన్నూర్‌ మండలం లంబాడిపల్లికి చెంది న ఈయన వయసు 65 ఏళ్లు. ఇప్పటి వరకు పది ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నాడు. ఇటీవల చేపట్టిన సర్‌ ప్రక్రియలో భాగంగా 2002 ఓటరు జాబితాలో రాజు నాయక్‌ పేరు కనిపించలేదు. దీంతో అతనికి సర్‌ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో తన ఓటు ఉంటుందో పోతుందో అని రాజు నాయక్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

చెన్నూర్‌: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ(సర్‌) చెన్నూర్‌ మండలం లంబాడిపల్లి గ్రామ ఓటర్లను కలవరపెడుతోంది. ఆ పంచాయతీలోని వందలాది మందికి నోటీసులు జారీయ్యాయి. వారంతా ఆధారాలతో పత్రాలు సమర్పించినా సర్‌ ప్రక్రియలో పేర్లు నమోదు కాలేదు. రానున్న ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుందా లేదా అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అందరికీ నోటీసులు..

లంబాడిపల్లి గ్రామ పంచాయతీలో మొత్తం 425 మంది ఓటర్లు ఉండగా, 15 మంది మృతి చెందా రు. ప్రస్తుతం 410 మంది ఉన్నారు. సర్‌ ప్రక్రియలో అందరికీ నోటీసులు రావడంతో సంబంధిత ధ్రువీ కరణ పత్రాలను బీఎల్‌వోలకు అందజేశారు. అయినా రెండు దఫాలు మళ్లీ నోటీసులు జారీయ్యాయి. 2002 ఓటరు జాబితాలో పేర్లు లేవని తెలిపినందున ఆందోళన మరింత పెరిగింది.

హక్కు ప్రశ్నార్థకం

లంబాడిపల్లిలో సుమారు వందేళ్లుగా తాతలు, తండ్రులు జీవనం సాగించారని ప్రజలు తెలిపారు. పంచాయతీగా ఏర్పడి పది సంవత్సరాలు అవుతోంది. ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు విని యోగించుకున్నామని, గత గ్రామ పంచాయతీ ఎ న్నికల్లో కూడా ఓటు వేసిన పేర్లు జాబితాలో లేకపోవడం దారుణమని గ్రామస్తులు అంటున్నారు. జి ల్లా అధికారులు స్పందించి పాత రికార్డులు పరిశీ లించి ఓటు హక్కు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement