చెరువును కాపాడాలని రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

చెరువును కాపాడాలని రాస్తారోకో

Sep 27 2026 12:16 AM | Updated on Sep 27 2026 12:16 AM

జన్నారం: చెరువును కబ్జా కోరల్లో నుంచి కాపాడాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రైతులు రోడ్డెక్కారు. మండలంలోని రేండ్లగూడలోగల అల్లం కుంట చెరు వును గ్రామానికి చెందిన కొందరు కబ్జా చేశారని ఆరోపిస్తూ, చెరువు కబ్జా కాకుండా చూడాలని డి మాండ్‌ చేస్తూ ఆరు రోజులుగా చేపట్టిన రిలే నిరా హార దీక్షలో భాగంగా వంటావార్పు నిర్వహించి రై తులు రాస్తారోకోకు దిగారు. గంటపాటు రాస్తారో కో చేయగా ఇరువైపులా వాహనాలు నిలిచి రాకపోకలకు అంతరాయమేర్పడింది. ఎస్సై ఉదయ్‌కిరణ్‌, ఇరిగేషన్‌ డీఈ వెంకటేశం రేండ్లగూడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. దీంతో రైతులు రాస్తారోకో విరమించారు. ఈ సందర్భంగా రైతులు సముద్రా ల శంకర్‌, దాసరి తిరుపతి మాట్లాడుతూ.. రేండ్లగూడ గ్రామానికి చెందిన పలువురు భూస్వాములు చెరువు భూమిని కబ్జా చేసి, అక్రమంగా పట్టా చే యించుకున్నారని ఆరోపించారు. అధికారులు అలసత్వంతోనే కబ్జా విషయంలో చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కబ్జా నుంచి చెరువు భూమిని కాపాడి, అక్రమ పట్టాలు రద్దు చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. గ్రామానికి చెందిన రైతులు రవి, సురేశ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement