శ్రీరాంపూర్: వీరత్వానికి చాకలి ఐలమ్మ స్పూర్తి అని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. శనివారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జీఎం మాట్లాడుతూ సీ్త్రగా, వెనుకబడిన తరగతుల్లో జన్మించిన కూడా పురుషాధిక్యత ఉన్న ఆ రోజుల్లో పెత్తందార్ల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, అధికారుల సంఘం ప్రతినిధి పద్మ, ఏజీఎం(ఫైనాన్స్) శ్రీధర్, డీజీఎంలు అనిల్ కుమార్, రాజన్న, సర్వే అధికారి నర్సింగరావు, పర్చేస్ అధికారి చంద్రశేఖర్, లా ఆఫీసర్ మల్లేష్, ఐటి అధికారి శ్రీనివాస్ డీవైపీఎం క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
అడవిపందిని హతమార్చిన కేసులో విచారణ
భీమిని: కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామ శివారులో అడవిపందిని హతమార్చిన ఘటనపై అటవీ అధికారులు శనివారం విచారణ చేపట్టారు. టేకులపల్లి శివారులో కొందరు వ్యక్తులు అడవిపందిని వేటాడి మాంసం పంచుకున్నట్లు తమకు అందిన సమాచారం మేరకు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు బెల్లంపల్లి డిప్యూటీ రేంజ్ అధికారి గౌరిశంకర్ తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.


