పుష్కరఘాట్‌ పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పుష్కరఘాట్‌ పనుల పరిశీలన

Sep 27 2026 12:16 AM | Updated on Sep 27 2026 12:16 AM

జైపూర్‌: మండలంలోని వేలాల మల్లన్నస్వామి ఆలయం, గోదావరి పుష్కరాల అభివృద్ధి పనుల ను శనివారం ఆర్‌డబ్ల్యూఎస్‌, దేవాదాయశాఖ అ ధికారులు వేర్వేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రవీందర్‌, ఈఈ వెంకటేశ్‌, డీఈ కిరణ్‌, ఏఈ రాజ్‌మల్లయ్య స్థాని క సర్పంచ్‌ డేగ స్వప్ననగేశ్‌తో కలిసి గోదావరి ఒడ్డున పుష్కరఘాట్‌ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పుష్కరాల సందర్భంగా వేలాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. దేవాదా యశాఖ ఏఈ ప్రతాప్‌, ఇన్‌చార్జి ఈవో వేణుగో పాల్‌తో కలిసి వేలాల మల్లన్నస్వామి ఆలయం వద్ద, గోదావరి ఒడ్డున పుష్కరఘాట్‌ వద్ద భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న పనులు, సుందరీకరణ పనులు పరిశీలించారు. రెండుశాఖల అధికారులు వేర్వేరుగా పనులు చేపట్టే ప్రాంతాలను గుర్తించారు. వారితో స్థానిక ఉపసర్పంచ్‌ రాజలింగు, పంచాయతీ కార్యదర్శి రాకేశ్‌, పంచాయతీ పాలకవర్గ సభ్యులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement