డీఏలు, పీఆర్సీపై ఉద్యోగుల హర్షం | - | Sakshi
Sakshi News home page

డీఏలు, పీఆర్సీపై ఉద్యోగుల హర్షం

Sep 26 2026 12:08 AM | Updated on Sep 26 2026 12:08 AM

మంచిర్యాలటౌన్‌: ఉద్యోగుల ప్రధాన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కీలక హామీలు ఇవ్వడంపై టీజీఈజేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. దసరాకు రెండు డీఏలు, సంక్రాంతికి మరో డీఏ విడుదలతోపాటు ఈ నెలాఖరులోపు పీఆర్సీ నివేదిక తెప్పించి, మెరుగైన ఫిట్‌మెంట్‌తో అమలుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ సీపీఎస్‌ రద్దుపై కమిటీ ఏర్పాటు చేస్తామని, ఉద్యోగుల ఇతర సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిందని తెలిపారు. భవిష్యత్‌లో టీజీజేఏసీ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఉద్యోగులందరూ సమష్టిగా, ఐక్యంగా ముందుకు సాగి న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. టీజీజేఏసీ జిల్లా చైర్మన్‌ గడియారం శ్రీహరి, కార్యదర్శి వనజారెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

నేడు, రేపు జయంతి ఉత్సవాలు

మంచిర్యాలటౌన్‌: నస్పూరులోని కలెక్టరేట్‌లో ఈ నెల 26న ఉదయం 10:30 గంటలకు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి, 27న ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నీరటి రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల్లో జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement