అభివృద్ధి పనులు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

Sep 26 2026 12:08 AM | Updated on Sep 26 2026 12:08 AM

బెల్లంపల్లి: మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్‌ కమిషనర్‌ తన్నీరు రమేష్‌తో కలిసి అభివృద్ధి పనులు పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, ఇతర అభివృద్ద్ధి పనులు నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి రోజువారీగా తడి, పొడి చెత్త సేకరించి డంపింగ్‌యార్డ్‌కు తరలించాలని తెలిపారు. బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌తో కలిసి నియోజకవర్గంలోని తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో మ్యాపింగ్‌ కాని, అనామలిస్‌ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారణ వేగవంతం చేయాలన్నారు. భూ సమస్యల పరిష్కారంలో భాగంగా చేపట్టిన రీ సర్వేలో గ్రామ నక్షాలు, వివిధ రకాల భూముల గుర్తింపు వేగవంతం చేయాలని ఆదేశించారు. సాదాబైనామా, భూభారతి, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అన్నారు. 22ఏ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement