కాసిపేట: వైద్య సిబ్బంది సీజనల్ వ్యాధుల దృష్ట్యా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఎస్‌ఐఆర్–2026 హియరింగ్ ప్రక్రియ నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రీ సర్వే, భూభారతి, రెవెన్యూ సదస్సుల దరఖాస్తు పరిష్కారం అంశాలపై సమీక్షించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, రిజిష్టర్లు, పరిసరాలను పరిశీలించారు. పరిసరాల్లో పారిశద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునిల్‌కుమార్, మండల వైద్యాధికారి శ్రీదివ్య, నయబ్ తహసీల్దార్ అంజయ్య పాల్గొన్నారు.


