జాతీయ పోషణమాసం అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. చిన్నారుల్లో బరువు తక్కువగా ఉండడం, ఎత్తుకు తగిన బరువు లేక, వయస్సుకు తగినట్లు ఎదుగుదల లేని వారిని గుర్తించి నెల రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి వారిలో ఆరోగ్యకరమైన ఎదుగుదల జరిగేలా చేస్తున్నాం. పోషకాహార లోపంతో ఉన్నవారిని గుర్తించి అవసరమైన పౌష్టికాహారం అందించడం, చిన్నారులకు వైద్య పరీక్షలను నిర్వహించి, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం.
– రౌఫ్‌ఖాన్, జిల్లా సంక్షేమశాఖ అధికారి, మంచిర్యాల


