ఆర్కేపీ ఠాణాలో సిబ్బంది కొరత | - | Sakshi
Sakshi News home page

ఆర్కేపీ ఠాణాలో సిబ్బంది కొరత

Sep 26 2026 12:08 AM | Updated on Sep 26 2026 12:08 AM

● ఒక్కొక్కరికి నాలుగైదు బాధ్యతలు ● పెరుగుతున్న పరిధితో నేరాలపై ప్రభావం

● ఒక్కొక్కరికి నాలుగైదు బాధ్యతలు ● పెరుగుతున్న పరిధితో నేరాలపై ప్రభావం

రామకృష్ణాపూర్‌: విస్తీర్ణం పెరుగుతోంది.. కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. జనాభా క్రమంగా పెరుగుతోంది. కానీ రామకృష్ణాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది సంఖ్య మాత్రం అందుకు తగ్గట్టుగా పెరగడం లేదు. దాదాపు 45 వేల జనాభా ఉండగా.. స్టేషన్‌లో 30 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఎస్సై, అదనపు ఎస్సై, ముగ్గురు ఏఎస్సైలు, ఐదుగురు హెడ్‌ కానిస్టేబుళ్లు, 20 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. విస్తారమైన పరిధికి ఈ సంఖ్య సరిపోకపోవడంతో పోలీసులపై పని ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోంది. ఉన్న వారిలోనే కోర్టు డ్యూటీలు, రైటర్‌ విధులు, బ్లూకోట్‌, స్పెషల్‌ డ్యూటీలు, గన్‌మెన్‌ తదితర బాధ్యతలకు సిబ్బందిని కేటాయించాల్సి ఉంటోంది. దీంతో సాధారణ పెట్రోలింగ్‌, శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, ఫిర్యాదుల విచారణ, అత్యవసర సంఘటనలకు స్పందించడం వంటి విధులకు అందుబాటులో ఉండే సిబ్బంది సంఖ్య తగ్గుతోంది.

ఒక్కొక్కరికి నాలుగైదు విధులు

సిబ్బంది కొరత కారణంగా ఒకే కానిస్టేబుల్‌ పలు రకాల విధులు నిర్వహించాల్సి వస్తోంది. కోర్టుకు వెళ్లడం, వారెంట్లు, సమన్లు అమలు చేయడం, స్టేషన్‌ విధులు, పెట్రోలింగ్‌, బందో బస్తు, అత్యవసర డ్యూటీలు, ఇలా ఒకే వ్యకి ్తపై పలు బాధ్యతలు పడుతున్నాయి. ఎవరైనా సెలవులో ఉన్నా బందోబస్తుకు వెళ్లినా లేదా ఇ తర ప్రత్యేక విధులకు కేటాయించినా మిగిలిన సిబ్బందిపైనే అదనపు భారం పడుతోంది. పోలీస్‌స్టేషన్‌ పరిధి కూడా క్రమంగా విస్తరిస్తోంది. గద్దెరాగిడి, తిమ్మాపూర్‌ తదితర ప్రాంతాల్లో కొత్త ఇళ్లు, కొత్త కాలనీలు వేగంగా ఏర్పడుతన్నాయి. జానాభా పెరుగుతున్నా కొద్దీ పోలీసులపై బాధ్యతలు కూడా పెరుగుతున్నాయి.

గంజాయి, చోరీలపై

నిఘా పెంచాలని డిమాండ్‌

ఇటీవలి కాలంలో గంజాయి చలామణి, విని యోగం, దొంగతనాలపై స్థానికంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అరికట్టేందుకు అనుమానితుల కదలికలపై నిఘా, సమస్యాత్మక ప్రాంతాల్లో పెట్రోలింగ్‌, సమాచార వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా క్రైమ్‌ వాచ్‌ నిర్వహించే సిబ్బంది అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుతున్నారు.

ఆదివారం బ్యాంక్‌లకు

నో హాలిడే

పాతమంచిర్యాల: బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28, 29, 30న దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్న కారణంగా మూడు రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. 4వ శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలువులు కావడంతో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు పని చేయవు. కాగా ఈ నెల 27న ఆదివారం రోజు వినియోగదారుల లావాదేవీల సౌకర్యం కోసం బ్యాంకులు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ఆదేశాలు వచ్చాయని ఎస్‌బీఐఎస్‌యూహెచ్‌సీ రీజినల్‌ సెక్రెటరీ కే.శ్రీనివాస్‌ తెలిపారు. ఆదివారం బ్యాంకు ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని, మరుసటి రోజు సోమ, మంగళ, బుధవారాల్లో సమ్మెలో పాల్గొంటారని తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement