మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 19న నిర్వహించిన జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో నగర పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రణయ్‌కుమార్, ఉల్లాస్, అరుణ్‌ణకుమార్ రాష్ట్ర స్థాయి జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 26, 27న హన్మకొండలోని స్టేడియంలో జరిగే పోటీల్లో పాల్గొంటారు. విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు కుమ్మరి మోహన్, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ కస్తూరి రమేశ్, వ్యాయామ ఉపాధ్యాయులు పున్నం, జాతీయ కోచ్ కుమ్మరి శ్రీకాంత్, పీఈటీ మాస్టర్ ముత్యం, రాము అభినందించారు.
ఫుట్‌బాల్ జిల్లా జట్టు..
రామకృష్ణాపూర్/బెల్లంపల్లి: మందమర్రి మండలం బొక్కలగుట్టలోని హెవెన్ ఆఫ్ హోప్ స్కూల్‌లో శుక్రవారం అండర్–19 బాలుర ఫుట్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ఎంపిక పోటీలు జరుగగా ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో భువనగిరిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ బాబురావు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కారోలీన్ విగ్, ఔట్‌రీచ్ మ్యాప్ డైరెక్టర్ పాల్‌విగ్, పీడీ సుదీప్, పీఈటీలు శేఖర్, సురేందర్, రాజేందర్ పాల్గొన్నారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారిలో బెల్లంపల్లిలోని తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కాసిపేట బాలుర గురుకుల పాఠఽశాల/కళాశాల విద్యార్థులు ఎం.విఘ్నేశ్వర్, జి.కార్తీక్ ఉన్నారు. వీరిని ప్రిన్సిపాల్ సంతోష్‌కుమార్, పీడీ కే.హరీష్, పీఈటీ ఏ.రాజేందర్ అభినందించి సన్మానించారు.


