మంచిర్యాలరూరల్(హాజీపూర్): నగర పరిధిలోని ముల్కల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టేబుల్ టెన్నీస్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్–14, 17 విభాగాల్లో బాల, బాలికల ఎంపిక పోటీలను కార్పొరేటర్ బియ్యాల త్రివేణీ, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయుడు రాజేశం, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి యాకుబ్ ప్రారంభించారు. ఎస్‌జీఎఫ్ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి రామ్మోహన్‌రావు, నిర్వాహక కార్యదర్శి సంతోశ్, పీడీలు, జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు.
జోనల్ స్థాయికి ఎంపికై న క్రీడాకారులు
అండర్–17 బాలుర విభాగంలో జయరాజ్, సాయితేజ(జెడ్పీ పాఠశాల–ముల్కల్ల), రిత్విక్(ఎంజేపీ–లక్సెట్టిపేట), నివాన్, సుప్రతిక్ వర్మ(ఆల్ఫోర్స్ పాఠశాల) ఎంపికయ్యారు. బాలికల విభాగంలో డి.అకుల్య, పి.సత్యచతుర్వేది(కార్మల్ పాఠశాల), కే.అశ్విత(జడ్పీ పాఠశాల–ముల్కల్ల), కే.లక్ష్మీ సహస్ర(జెడ్పీ పాఠశాల–బెల్లంపల్లి) ఎంపికయ్యారు.
అండర్–14 బాలుర విభాగంలో రౌనిత్‌రెడ్డి(డీఏవీ–దేవాపూర్), అభిరామ్(జెడ్పీ పాఠశాల–ముల్కల్ల), జి.సహస్, శ్రీహితార్థ్(ఆల్ఫోర్స్ పాఠశాల) ఎంపికయ్యారు. బాలికల విభాగంలో సహానశ్రీ, ఆరోహీ(ఆల్ఫోర్స్ పాఠశాల), సీహెచ్.లాస్య(జెడ్పీ పాఠశాల–ముల్కల్ల), నిషాఅరుజున్(జెడ్పీ పాఠశాల–బెల్లంపల్లి) ఎంపికయ్యారు.


