శ్రీరాంపూర్: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్ని కల కాలపరిమితి ముగిసినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్కే 5 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయ న కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికలు నిర్వహించే వరకు అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించి కార్మికుల సమస్యలపై చర్చలకు పిలువాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో ప్రైవేటీకరణకు ఆధ్యులు ఏఐటీయూసీ నేతలే అని ఆరో పించారు. నాడు కోయగూడెం ఓపెన్ కాస్ట్‌లో ప్రైవే ట్ సర్ఫేస్ మైనర్‌ను ప్రవేశపెట్టింది వారు కాదా? అని ప్రశ్నించారు. ఇటీవల ఆర్‌ఎల్‌సీ వద్ద ఏఐటీయూసీ నేతలు 24 డిమాండ్లపై ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంటున్నారని, 12(3) ఒప్పందం ప్రకా రం వారు చేసుకున్న ఒప్పంద పత్రాలను కార్మికుల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆర్కే 5 గని లో సీనియర్ కార్మిక నాయకుడు రామిడి మహేందర్‌రెడ్డితోపాటు పలువురు టీబీజీకేఎస్‌లో చేరారు. కార్యక్రమంలో యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పెట్ట్టం లక్ష్మణ్, నాయకులు పానుగంటి సత్తయ్య, పొగాకు రమేశ్, అన్వేశ్‌రెడ్డి, పాశం శ్రీనివాస్‌రెడ్డి, ఎండీ లా ల, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బ య్య, మేరుగు పవన్‌కుమార్ పాల్గొన్నారు.


