జన్నారం: డీజే వాహనం సీజ్ చేసి యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపారు. మండలంలోని మురిమడుగులో బుధవారం రాత్రి గణేశ్ నిమజ్జనోత్సవాల్లో అత్యధిక శబ్దంతో ప్రజల ప్రశాంతతకు భంగం వాటిల్లేలా ప్రదర్శిస్తున్న డీజే, వాహనాన్ని సీజ్ చేసి యజమాని శ్రీరామ్‌నగర్ కాలనీ చెందిన ముల్కల్ల సంజీవ్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
కేయూ పరిధిలో
నేటి పరీక్షలు వాయిదా
కేయూక్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో శుక్రవారం నిర్వహించనున్న దూరవిద్య డిగ్రీ, పీజీ, రెగ్యులర్ లా తదితర పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కే.రాజేందర్ తెలిపారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో గురువారం కూడా అన్ని పరీక్షలు వాయిదా వేశామని పేర్కొన్నారు. మిగిలిన పరీక్షలు టైంటేబుల్ ప్రకారం యధావిధిగా జరుగుతాయని, ఈ నెల 24, 25 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థులకు
అరుదైన గుర్తింపు
మంచిర్యాలఅర్బన్: వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో జాతీయ సేవా పథకం స్వర్ణోత్సవ వేడుకల్లో గురువారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో స్థానిక వివేకావర్థిని డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులకు అరుదైన గుర్తింపు దక్కింది. రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో పాల్గొన్న వలంటీర్స్‌కు అవకాశం కల్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేకావర్థిని వలంటీర్స్ పాల్గొని బోనాల పండుగ పాటలకు నృత్యం చేసి అలరించారు. ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా కన్వీనర్, కళాశాల కరస్పాండెంట్ ఉదారి చంద్రమోహన్ గౌడ్ రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం, మాజీ కోఆర్డినేటర్ జ్యోతి, కోఆర్డినేటర్ ఈసం సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారి షరీనా, తదితరులు పాల్గొన్నారు.


