చెన్నూర్: 2027లో గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల నుంచి పుష్కర స్నానం ఆచరించేందుకు విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేపట్టాలనే ఉద్దేశంతో ముందుకెళ్తోంది. ఇటీవలే నిధులు కూడా మంజూరు చేసింది. చెన్నూర్‌లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి రూ.8 కోట్ల నిధులతో పుష్కర ఘాట్లు, గోదావరిమాత విగ్రహం, భక్తులకు షెడ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. టెండర్లు పూర్తి కాగానే రోడ్డు నిర్మాణ పనులతో పాటు ఇతర పనులు ప్రారంభించే అవకాశం ఉంది. చెన్నూర్ పట్టణంతో పాటు మండలంలోని పలు ఆలయాల అభివృద్ధికి మరో రూ.10 కోట్ల నిధులు మంజూరు కానున్నాయి. మరో పది నెలల్లో గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఎలాంటి ఆటంకాలు లే కుండా పనులు సజావుగా సాగితే సకాలంలో పూ ర్తయ్యే అవకాశం ఉంటుంది.
చెన్నూర్ గోదావరి నుంచి ఇసుక రవాణా
చెన్నూర్ గోదావరి నుంచి ఇసుక తరలించేందుకు మైనింగ్ శాఖ గతంలో సింగరేణికి 30 ఏళ్లపాటు అ నుమతించింది. సంస్థకు ఇసుక తప్పనిసరి కావడంతో సుదీర్ఘకాలం అనుమతి పొందింది. పదేళ్లుగా రో జుకు 40 నుంచి 50 వరకు లారీల్లో ఇసుక తరలిస్తున్నారు. పుష్కర పనులు ప్రారంభమైతే ఇసుక రవా ణా దారి మళ్లీస్తారా? లేదా ఇదే దారి గుండా కొనసాగిస్తారా? అని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. పదేళ్లుగా అధికలోడుతో ఇసుక రవాణాతో గోదావరి రోడ్డు అధ్వానంగా మారిందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాలు పూర్తయ్యే వరకు ఇసుక రవాణా ను దారి మళ్లించాల్సిన అవసరం ఉందని పట్టణ ప్రజలు అంటున్నారు. ఈ విషయంపై జిల్లా అధికా రులు, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలని కోరుతున్నారు.


