నిశీధి వేళ విధి నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

నిశీధి వేళ విధి నిర్వహణ

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

దండేపల్లి: కుండపోత వర్షం.. గణపతి నిమజ్జనోత్సవంలో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. 33 కేవీ విద్యుత్‌ లైన్‌ బ్రేక్‌డౌన్‌ కావడంతో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో దండేపల్లి మండలంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. లక్సెట్టిపేట ఏడీఈ బి.తిరుపతి తక్షణమే స్పందించారు. వర్షం, సమయాన్ని లెక్కచేయకుండా దండేపల్లి ఏఈ బాపు, జన్నారం సబ్‌ ఇంజనీర్లు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. టార్చిలైట్ల వెలుగులోనే 33 కేవీలైన్‌ వెంట కిలోమీటర్ల మేర నడిచారు. అర్ధరాత్రి వేళ తనిఖీలు చేస్తూ బ్రేక్‌డౌన్‌కు కారణమైన లోపాన్ని గుర్తించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు వర్షంలో తడుస్తూ శ్రమించి, సమస్యను సరిచేసి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement