రెస్క్యూ ఓవరాల్‌ చాంపియన్‌గా ఆర్జీ–2,3 | - | Sakshi
Sakshi News home page

రెస్క్యూ ఓవరాల్‌ చాంపియన్‌గా ఆర్జీ–2,3

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

గోదావరిఖని: సింగరేణి రెస్క్యూపోటీల్లో ఓవరాల్‌ చాంపియన్‌గా ఆర్జీ–2,3, ఏపీఏ జట్టు నిలిచింది. గురువారంతో సింగరేణి మైన్స్‌రెస్క్యూ పోటీలు ముగిసాయి. పోటీల్లో ఓవరాల్‌ ఫస్ట్‌ ఉమెన్‌ జట్టుగా స్మార్ట్‌ ఏ జట్టు నిలవగా మెటల్‌ టీంలో ఓవరాల్‌ ఫస్ట్‌గా యూరేనియం కార్పొరేషన్‌ జట్టు, ఓవరాల్‌ రెండో స్థానంలో ఆర్జీ–1, ఓవరాల్‌ మూడో స్థానంలో శ్రీరాంపూర్‌ జట్లు నిలిచాయి. బెస్ట్‌ ఉమెన్‌ కెప్టెన్‌గా మౌనిక, బెస్ట్‌ మెటల్‌ కెప్టెన్‌గా భాస్కర్‌, ఫస్ట్‌ బెస్ట్‌ కెప్టెన్‌గా జి.ప్రమోద్‌కుమార్‌ ఎంపికయ్యారు. రెండో ఫస్ట్‌ కెప్టెన్‌గా సాంబ నిలిచారు. వీటితో బెస్ట్‌ స్టాట్యుటరీ, థియరీ, ఫస్ట్‌ఎయిడ్‌, రెస్యూ అండ్‌ రికవరీ, బెస్ట్‌ మెంబర్లను ప్రకటించారు. విజేతలకు డిప్యూటీ డైరెక్టర్‌ మైన్స్‌ సేఫ్టీ టీఆర్‌ కన్నన్‌, సింగరేణి డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు బహుమతులు అందజేశారు. పోటీల ముగింపు సందర్భంగా నిర్వహించిన చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. మంథని జేఎన్‌టీయూ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement