వృద్ధురాలి హత్యకేసులో ముగ్గురి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి హత్యకేసులో ముగ్గురి అరెస్టు

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలిని హత్య చేసిన ప్రధాన నిందితుడితో పాటు ఆభరణాలను విక్రయించేందుకు సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ నితిక పంత్‌ తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆగస్టు 30న ఆసిఫాబాద్‌ మండలంలోని బూరుగూడకు చెందిన మేకర్తి మల్లక్క (80) ఇంట్లోకి ప్రవేశించిన ధనుంజయ్‌ బండరాయితో తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యాడు. ఈ నెల 21న వృద్ధురాలి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూడగా మల్లక్క మృతి చెంది కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. ధనుంజయ్‌ దొంగలించిన బంగారాన్ని అమ్మేందుకు ప్రవీణ్‌ సహాయంతో మహేష్‌కు రూ.32వేలకు విక్రయించాడు. అందులో నుంచి ప్రవీణ్‌ రూ.3 వేలు కమీషన్‌ తీసుకున్నాడు. వచ్చిన డబ్బులతో దుబారా ఖర్చు పెడుతుండడంతో అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని విచారించగా హత్య చేసినట్లుగా ఒప్పుకొన్నాడు. దీంతో ధనుంజయ్‌తో పాటు ప్రవీణ్‌, మహేష్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement