గిరిజనుల అభివృద్ధితోనే అటవీ సంరక్షణ | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల అభివృద్ధితోనే అటవీ సంరక్షణ

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

● మంచిర్యాల కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాలక్రైం: గిరిజనుల అభివృద్ధితోనే అటవీ సంరక్షణ సాధ్యమని మంచిర్యాల కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గిరిజనుల సమస్యలు, పరిష్కారం, పోడు సమస్యపై అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ నెల 23న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఏరియాలో 20 ఎన్‌జీవోస్‌, వివిధ సంస్థల అధికారులు, అటవీ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అనంతరం గురువారం జిల్లా కేంద్రంలోని ధరణి కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఉమ్మడి జిల్లా అటవీశాఖ అధికారులు, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఎఫ్‌డీపీటీ శాంతారామ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అటవీ శాఖ, ఐటీడీఏ అధికారులు సమన్వయంతో కమిటీ ఏర్పాటు చేసి గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పీఓ మాట్లాడుతూ అటవీ సంరక్షణలో గిరిజనుల భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల అమలుపై వివరించారు. ఎన్‌జీఓస్‌ నాయకులు మాట్లాడుతూ గిరిజనుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫ లమవుతున్న తీరు, అటవీ అధికారుల నిర్లక్ష్యం తది తర అంశాలను క్షుణ్ణంగా వివరించారు. డీఎఫ్‌ఓలు రాహుల్‌ కిషన్‌ జాదవ్‌, బాలామణి, సుషాంత్‌ సుఖ్‌దేవ్‌ బొడాడే, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement