మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలంలోని ర్యాలీ గ్రామ పంచాయతీ పరిధి కొలాంగూడ గిరిజన తండాలో ప్రారంభించిన హెల్త్‌సెంటర్‌లో గిరిజనులకు వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని జిల్లా వైద్యారోగ్యశాఖ అదికారి నరేందర్‌రాథోడ్ అన్నారు. గురువారం ఆయన ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం కింద నిర్మించిన మల్టీపర్పస్ భవన సముదాయంలో హెల్త్‌సెంటర్‌ను ప్రారంభించారు. హాజీపూర్ పీహెచ్‌సీ నిర్వహించిన వైద్య శిబిరంలో గిరిజనులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. గఢ్‌పూర్ గ్రామ పంచాయతీలోని ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ నుంచి సందర్శించి వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. హాజీపూర్ పీహెచ్‌సీ వైద్యాధికారి లహరి, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుధాకర్‌నాయక్, పీఎం జన్మన్ వైద్యాధికారి డాక్టర్ ఆదిత్యబాబు, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, కమ్యూనిటీ హెల్త్ అధికారి గుండేటి నాందేవ్ పాల్గొన్నారు.


