● రాష్ట్ర మంత్రి, ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

● రాష్ట్ర మంత్రి, ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యే

Sep 24 2026 2:00 AM | Updated on Sep 24 2026 2:00 AM

● రాష్ట్ర మంత్రి, ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యే

రోజురోజుకూ ముదురుతున్న వైరం రెండుగా చీలిపోతున్న పార్టీ క్యాడర్‌ పోటాపోటీ కార్యక్రమాల నిర్వహణ ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టిన ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల మధ్య వర్గపోరు ముదురుతోంది. రాష్ట్ర మంత్రి వివేక్‌ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఓ వైపు.. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మరోవైపు అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. ఈ నెల 21న ప్రేమ్‌సాగర్‌రావు పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావుతో కలిసి బహిరంగంగానే ఐక్యతను వెల్లడించారు. గతంలో అంతర్గతంగా ఉన్న మనస్పర్థలు తాజాగా బయటపడుతున్నాయి. దీంతో అధికార పార్టీలో ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు తేటతెల్లం అయిపోయాయి. వచ్చే ఎన్నికల నాటికి మరింత పెరిగే అవకాశాలున్నాయి.

గూడెం పర్యటనతో మొదలు..

గత జూలైలో దండేపల్లి మండలం గూడెంలో ఎంపీ వంశీకృష్ణ పర్యటన సందర్భంగా స్థానిక నాయకులు వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. దీనిపై వంశీకృష్ణ స్పందిస్తూ తాను ఎవరికీ భయపడనని, కాకా అభిమానులపై దాడులు చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరించారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌ నాయకులపైనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రేమ్‌సాగర్‌రావు అనుచరుడిగా ఉన్న మంతెన జగన్‌మోహన్‌రావు కాకా గడ్డం వెంకటస్వామి విగ్రహం ఆవిష్కరించి ఒక్కసారిగా దుమారం రేపారు. మంచిర్యాల నియోజకవర్గం నుంచి మంత్రి వివేక్‌ వర్గంలోకి ఒక్కొక్కర్ని తమవైపు తిప్పుకొంటున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ఎనిమిది మంది నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, లక్సెట్టిపేటకు చెందిన ఇద్దరు మున్సిపల్‌ కౌన్సిలర్లు ఎమ్మెల్యే వర్గాన్ని వీడి మంత్రి వైపు చేరారు. జగన్‌మోహన్‌రావు ఇంటికి మంత్రి వివేక్‌ వెళ్లారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో పనుల ప్రారంభోత్సవం సందర్భంగా మంతెన జగన్‌మోహన్‌రావు అనుచరులతో భారీ రోడ్‌షోతో హంగామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరుసటి రోజే తొలగించారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో తన ఇలా ఖాలో మంత్రి, ఎంపీ చేస్తున్న రాజకీయాలు ఎమ్మె ల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

ఎటు దారి తీస్తాయో?

మంత్రి, ఎంపీకి వ్యతిరేకంగా సాగుతున్న ఈ పర్యావసనాలు ఎటువైపు దారి తీస్తాయోనని కేడర్‌లో చర్చ నడుస్తోంది. మంచిర్యాలలో పట్టు సాధించేందుకు ఎంపీ ప్రయత్నాలు చేస్తుండగా, మంత్రి మద్దతు ఇస్తున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే తీవ్రంగా పరిగణిస్తున్నారు. తన నియోజకవర్గంలో వ్యతి రేకిగా మారిన మంతెన జగన్‌మోహనరావుతో కలిసి కార్యక్రమాలు చేయడం ఎమ్మెల్యేకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. కేడర్‌లోనూ రెండు వర్గాలు ఏర్పడడంతో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని పార్టీలో చర్చసాగుతోంది.

వివేక్‌కు వ్యతిరేకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు

పార్లమెంట్‌ ఎన్నికల నుంచే గడ్డం వంశీకృష్ణకు టికెట్‌ ఇవ్వడాన్ని స్థానిక ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. అయితే, అధిష్టానం వంశీకే టికెట్‌ ఖరారు చేయడంతో తప్పనిపరిస్థితుల్లో కాంగ్రెస్‌ గెలుపు కోసం పని చేశారు. అంతకుముందు మంత్రి వివేక్‌కు చెన్నూరు టికెట్‌, ఆ తర్వాత మంత్రి పదవి ఇచ్చే విషయంలోనూ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అవకాశాలకు గండి కొట్టారనే వాదనలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ తన పుట్టినరోజు సందర్భంగా తామంతా కలిసికట్టుగా పని చేసి ఎంపీగా గెలిపిస్తే, తమను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాము మద్దతు ఇవ్వకపోతే డిపాజిట్‌ దక్కకపోయేదంటూ వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రంలో గంజాయి బ్యాచ్‌ను లేకుండా చేస్తామంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. దళితులు ఎవరివైపు ఉన్నారో తేల్చుకుందాం అంటూ సవాల్‌ విసిరారు దళితులను మోసం చేసిన వారే వారి గురించి మాట్లాడుతున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement