రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించాలి

Sep 24 2026 2:00 AM | Updated on Sep 24 2026 2:00 AM

మంచిర్యాలఅగ్రికల్చర్‌: రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించాలని రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల శాఖ కమిషనర్‌ సురేంద్రమోహన్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెనన్స్‌ ద్వారా జిల్లా అదనపు కలెక్టర్‌, జిల్లా వ్యవసాయ, ఇతర శాఖల అధికారులతో డిజిటల్‌ క్రాప్‌ సర్వే, ఫార్మర్‌ రిజిస్ట్రీ, సన్న రకాల వరి ధాన్యం కొనుగోలు, బోనస్‌ చెల్లింపు, ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ ఉత్పత్తుల శాఖ కమిషనర్‌ మాట్లాడుతూ ప్రతీ కొనుగోలు కేంద్రంలో ఒకరికి సన్నరకం వరి ధాన్యాలపై అవగాహన, శిక్షణ ఇప్పించి వాలంటీర్‌గా నియమించాలని, గౌరవ భృతి చెల్లించాలని అన్నారు. తూకం యంత్రాలు, గన్నీ సంచులు, టార్పాలిన్లు, ఇతర మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వి.రాములు, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్‌, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్‌ శ్రీకళ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement