ఓటరు సవరణ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఓటరు సవరణ వేగవంతం చేయాలి

Sep 24 2026 2:00 AM | Updated on Sep 24 2026 2:00 AM

దండేపల్లి: ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ పారదర్శకంగా, వేగవంతగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. దండేపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో బుధవారం నిర్వహించిన సర్‌ హియరింగ్‌ను పరిశీలించారు. నోటీసులు అందుకున్న వారు తగిన ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారా లేదా అని ఆరా తీశారు. నోటీసులు అందుకున్న వారికి సమాచారం అందించి, ఆధార పత్రాలు స్వీకరించి సవరణ పూర్తి చేయాలని చెప్పారు. కుల ధ్రువీకరణ పత్రాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని కొందరు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. అలాంటిదేమీ ఉండదని అన్నారు. అంతకుముందు గూడెం గోదావరి నది వద్ద గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించారు. దండేపల్లి కేజీబీవీని సందర్శించి వసతులపై ఆరా తీశారు. దండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ద్వారక జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి 9వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రశ్నలు వేసి ప్రతిభ సామర్థ్యాలను పరిశీలించారు. ద్వారకలో ఎస్టీ హాస్టల్‌ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. తహసీల్దార్‌ రోహిత్‌కుమార్‌దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసాద్‌, ఆర్‌ఐ భూమన్న, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, రాజహరీష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement