38ఏళ్లకు భూ సమస్య పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

38ఏళ్లకు భూ సమస్య పరిష్కారం

Sep 24 2026 2:00 AM | Updated on Sep 24 2026 2:00 AM

కోటపల్లి: మండలంలోని రాంపూర్‌ గ్రామానికి చెందిన అడపా శంకరయ్య భూ సమస్య 38 ఏళ్ల తర్వాత పరిష్కారమైంది. 1988లో రాంపూర్‌ శివారులోని సర్వే నంబర్‌ 339లో మూడెకరాల పట్టా భూమిని సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసి సాగు చేస్తున్నాడు. పట్టా కోసం కార్యాలయాల చుట్టూ తిరిగాడు. సాదాబైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణలో భాగంగా తహసీల్దార్‌ రాఘవేంద్రరావు గ్రామంలో విచారణ, క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఆర్డీవో శ్రీనివాస్‌రావుకు సిఫారసు చేయగా, పరిశీలన అనంతరం ఆయన 13–బీ జారీ చేశారు. దీంతో భూమికి పట్టా జారీ కావడంతో శంకరయ్య ఆనందం వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement