మంచిర్యాలరూరల్(హాజీపూర్): విపత్తుల వే ళ ప్రాణ, ఆస్తి నష్టాల నివారణలో యువత పాత్ర కీలకమని, యువ ఆపదమిత్ర ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న యువత సేవా దృక్పథంతో సమాజంలో రాణించాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి సూ చించారు. మంగళవారం గుడిపేట 13వ ప్ర త్యేక పోలీస్ బెటాలియన్‌లో ఎస్‌డీఆర్‌ఎఫ్ ఆ ధ్వర్యంలో యువ ఆపదమిత్ర కార్యక్రమంలో భాగంగా కరీంగనర్ శాతవాహన యూనివర్సిటీ డిగ్రీ కళాశాల విద్యార్థులకు వారం రో జులుగా వరదలు, అగ్నిప్రమాదాలు, విపత్తు ల సమయాల్లో రెస్క్యూ ఆపరేషన్, క్షతగాత్రులను కాపాడడం, సీపీఆర్, ప్రథమ చికిత్స తదితర అంశాలపై ఇస్తున్న శిక్షణ ముగిసింది. ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి హాజరై విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కమాండెంట్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమాండెంట్ ఆంజనేయరెడ్డి, యూనిట్ మెడికల్ అధికారి డాక్టర్ సంతోష్‌సింగ్, అడ్మినిస్ట్రేటీవ్ అధికారి గౌస్‌మొహీయుద్దీన్, ఎస్‌డీఆర్‌ఎఫ్ ఆర్‌ఐ ఎం.అశోక్, బెటాలియన్ అధికారులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ శిక్షణ సిబ్బంది పాల్గొన్నారు.


