తాండూర్: భూముల రీ సర్వే ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం తహసీల్దార్ జ్యో త్స్నతో కలిసి మండలంలోని ద్వారకాపూర్ గ్రామంలో భూముల రీ సర్వేను పరిశీలించా రు. గ్రామ నక్షలు, రైతుల భూ రికార్డులను స రిచూసుకుంటూ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేప ట్టి రికార్డులు తయారు చేయాలన్నారు. భవి ష్యత్‌లో భూవివాదాలకు ఈ సర్వేతో చెక్ ప డనుందన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణాల పురోగతి, ఆసరా పింఛన్ల దరఖాస్తు ల పరిశీలన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీలో అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. తాండూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించి గర్భిణులతో మాట్లాడి పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి సర్ ప్రక్రియను నిర్ణీత గ డువులోపు పూర్తి చేయాలన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్, పీహెచ్‌సీ వైద్యురాలు ఝాన్సీరా ణి, కేజీబీవీ ఎస్వో కవిత పాల్గొన్నారు.


