మంచిర్యాలక్రైం: ఆనందో త్సహాల మధ్య జరగాల్సి న వేడుకల్లో చిన్న చిన్న త ప్పిదాలతో పెద్ద ప్రమాదా లు చోటు చేసుకునే అవకా శం ఉంటుంది. శోభాయా త్ర, నిమజ్జనం ప్రశాంతంగా సాగేలా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాతో నిఘాకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది. జిల్లాలో 2,379 విగ్రహాలు ఏర్పాటు చేయగా ఈ నెల 23, 24, 25వ తేదీల్లో నిమజ్జనం చేయనున్నారు. జిల్లాలో వినా యక నిమజ్జనం సందర్భంగా పోలీసు బందోబస్తు పై మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ వివరించారు.
నిఘా నీడన శోభాయాత్ర
Sep 23 2026 12:07 AM | Updated on Sep 23 2026 12:07 AM
● వేడుక కావొద్దు విషాదం
● డీసీపీ ఎగ్గడి భాస్కర్
● శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదు. డ్యా న్స్‌ల సమయంలో గొడవలు, అధిక సౌండ్‌తో గుండె సమస్యలున్నవారికి ప్రమాదం ఉంది. ని బంధనలు ఉల్లంఘించి డీజేలు ఉపయోగిస్తే కఠి న చర్యలు తీసుకుంటాం. ప్రమాదకర ర సాయనాలతో తయారు చేసిన రంగులు వాడకూడదు. వాటితో కళ్లకు ప్రమాదం పొంచి ఉంటుంది.
● రాయపట్నం, ఇందారం గోదావరి వద్ద క్రేన్‌ల ద్వారా వినాయకుల నిమజ్జనానికి ఏర్పాట్లు చే శాం. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి బారికే డ్లు ఏర్పాటు చేయడంతోపాటు గజ ఈతగాళ్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నాం. శోభాయాత్రలో మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.
● జిల్లాలో గత ఏడాది పండుగలు, ఇతర సమయాల్లో అల్లర్లు, గొడలకు పాల్పడిన 300మందిని ఇప్పటికే తహసీల్దార్ల వద్ద బైండోవర్ చేశాం. నిబంధనలు ఉల్లంఘించి నేరాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు, పీడీ యాక్ట్ నమోదు చేస్తాం.
● ముగ్గురు ఏసీపీలు, సీఐ, ఆర్‌ఐలు 26మంది, ఎస్సై, ఆర్‌ఎస్సై, సిబ్బంది, స్పెషల్ ఫోర్స్ 300మంది బందోబస్తులో పాల్గొంటారు.
Advertisement


