ఏసీబీకి చిక్కిన పెద్దపేట జీపీవో | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన పెద్దపేట జీపీవో

Sep 23 2026 12:07 AM | Updated on Sep 23 2026 12:07 AM

● రూ.80వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన వైనం

భీమిని: మండలంలోని పెద్దపేట గ్రామపంచాయ తీ పరిపాలన అధికారి(జీపీఓ) దుర్గాప్రసాద్‌ మంగళవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కాడు. రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆదిలాబాద్‌ రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకా రం.. పెద్దపేట గ్రామానికి చెందిన మహ్మద్‌ ఫకీర్‌కు గ్రామ శివారులోని సర్వే నంబరు 10లో 29 గుంటల భూమి కోసం సాదాబైనామా పత్రాల ద్వారా పట్టా పాస్‌బుక్కు జారీకి జీపీఓ దుర్గాప్రసాద్‌ రూ.1.30 లక్షలు డిమాండ్‌ చేశాడు. మొదటిగా విడతగా రూ.80 వేలు, పని పూర్తయ్యాక రూ.50 వేలు ఇవ్వాలని బేరం కుదుర్చుకున్నాడు. దీంతో ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం జీపీఓ దుర్గాప్రసాద్‌, తహసీల్దార్‌ కా ర్యాలయానికి ఎదురుగా ఉన్న కిరాణ కొట్టు యజ మాని పోతురాజుల రాజేందర్‌ కలిసి మోటారుసైకిల్‌పై వ్యవసాయ పొలాల వద్దకు వచ్చారు. రాజేందర్‌కు డబ్బులు ఇవ్వాలని జీపీవో చెప్పాడు. రాజేందర్‌ డబ్బులు తీసుకుని వెళ్తుండగా ఏసీబీ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే 1064, 9440446106కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement