మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ధాన్యం నిల్వకు అందుబాటులో ఉన్న గోదాములను గుర్తించి వివరాలు యాప్‌లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ వి.రాములు సూచించా రు. మంగళవారం తన చాంబర్‌లో జిల్లా పౌ రసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, మేనేజర్ శ్రీకళతో కలిసి ఎస్‌డబ్ల్యూసీ గోదాముల మేనేజర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా అవసరమైన నిల్వ స్థలాలను గుర్తించి అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం జి ల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. సామర్థ్యానికి అనుగుణంగా రైస్ మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ డెలివరీల ను వేగవంతం చేసి, నిర్దేశిత లక్ష్యాలను సకా లంలో పూర్తి చేయాలని సూచించారు. వానా కాలం సీజన్‌కు సంబంధించి ప్రాథమిక వ్యవసాయ సహకార ప్రతినిధులు, మెప్మా, డీసీ ఎంస్ ప్రతినిధులతో ధాన్యం సేకరణపై సమీ క్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన పరి కరా లు, మౌలిక సదుపాయాలను నెలాఖరులోపు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సేకరణ కేంద్రాల ఏర్పాటుకు తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలను (లో–లైయింగ్ ఏరియాలు) ఎంపిక చేయరాదని, సేకరణ కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముంద స్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.


