సమస్యల పరిష్కారానికే ఫిర్యాదుల విభాగం | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికే ఫిర్యాదుల విభాగం

Sep 22 2026 12:30 AM | Updated on Sep 22 2026 12:30 AM

మంచిర్యాలక్రైం: బాధితుల సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజా ఫిర్యాదుల విభాగం చేపడుతున్నట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా తెలిపారు. కమిషనరేట్‌ ఆవరణలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలతో మాట్లాడి చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. అదనపు డీసీపీ శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

వినాయక నిమజ్జనంపై సమీక్ష

మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వినాయక నిమజ్జన శోభాయాత్ర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా సమీక్షించారు. శాంతియుతంగా నిమజ్జనం, శోభాయాత్ర జరిగే విధంగా కృషి చేయాలని అన్నారు. రక్షణ సిబ్బంది, గజ ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు ఉంచాలని తెలిపా రు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ శ్రీనివాస్‌, ఆర్‌జీ 1 జీఎం లలిత్‌కుమార్‌, ఎస్‌బీ ఏసీపీ నాగేంద్రగౌడ్‌, గోదావరిఖని ఏసీపీ రమేష్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement