● తెలంగాణ విద్యార్థికి ప్రతిష్టాత్మక బారన్ అవార్డు ● అమెరికాలోని టాప్–15 మంది విద్యార్థుల్లో శ్రీహిత్ చిన్నారెడ్డి
రామకృష్ణాపూర్: కృత్రిమ మేథ (ఏఐ) పరిశోధనలో తెలంగాణకు చెందిన 16 ఏళ్ల విద్యార్థి శ్రీహిత్ చిన్నారెడ్డి విశేష ప్రతిభ కనబర్చి అమెరికాలో ప్రతిష్టాత్మకంగా భావించే బారన్ అవార్డుకు ఎంపికయ్యాడు. అల్జీమర్స్ వ్యాధి ప్రభావా లను తగ్గించేందుకు ఇటీవల ఏఐ ఆధారిత ప్రాజెక్టును రూపొందించినందుకు ఈ గుర్తింపు లభించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అవార్డుకు ఎంపికై న టాప్ 15 మంది విద్యార్థుల్లో హైదరాబాద్‌కు చెందిన శ్రీహిత్ ఉండడం గర్వకారణమని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అవార్డుకు ఎంపికై న వారికి ఒక్కొక్కరికి 10 వేల అమెరికన్ డాలర్ల నగదు పురస్కారం అందజేయనున్నట్లు తెలిపారు. శ్రీహిత్ ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని బెల్ల వ్యూ సియాటెల్ ప్రాంతంలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్నాడు. అతని తండ్రి వెంకటేశ్వర్లు సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నారు.
రామకృష్ణాపూర్‌తో ప్రత్యేక అనుబంధం..
శ్రీహిత్ కుటుంబానికి రామకృష్ణాపూర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. అతని తల్లి ప్రసన్న పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. కుటుంబంలోని పలువురు గతంలో ఆర్‌కేపీలో నివాసం ఉండగా ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు.


