‘ప్రసంగ చంద్రిక’ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘ప్రసంగ చంద్రిక’ ఆవిష్కరణ

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

మంచిర్యాలఅర్బన్‌: జిల్లా కేంద్రంలోని ఓ పంక్షన్‌హాల్‌లో సాహితీ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో సుబ్బాయమ్మ రచించిన ప్రసంగ చంద్రిక పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవులు మాట్లాడుతూ.. గతంలో ఏడు పుస్తకాలు రచించిన సుబ్బాయమ్మ నూత న గ్రంథంలో 13 ముఖ్యమైన అంశాలతో ఆషా ఢ, శ్రావణ మాసాల విశిష్టత, పండుగల ప్రాశస్త్యాన్ని సమగ్రంగా వివరించారని పేర్కొన్నా రు. ఈ సందర్భంగా సుబ్బాయమ్మను సన్మానించారు. శతావధాని, చెన్నూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటరమణ పట్వర్థన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆదిలాబాద్‌ ఆకాశవాణి విశ్రాంత సంచాలకుడు సుమనస్పతీరెడ్డి, ప్రస్తుత సంచాలకుడు రామేశ్వర్‌, ఆకాశవాణి ఆదిలాబాద్‌ కేంద్రం వ్యాఖ్యాత కట్ట లెని న్‌, సాహితీ సంరక్షణ సమితి అధ్యక్షుడు వామ న్‌రావు, ప్రధాన కార్యదర్శి అల్లాడి శ్రీనివాస్‌, మహిళా కార్యదర్శి శ్రీలక్ష్మి, పుస్తక సమీక్షకులు నోముల చంద్రశేఖర్‌, జ్యోత్స్న, వెంకటకిషన్‌, లక్ష్మణ్‌, బ్రహ్మయ్యచార్య తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement