బెల్లంపల్లి: బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో ఆదివారం తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ అథ్లెటిక్ పోటీలు నిర్వహించారు. బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రవికుమార్, వన్‌టౌన్ ఎస్సై రామకృష్ణ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. స్పీడ్ వాక్, రన్నింగ్, షాట్‌పుట్, టగ్ అఫ్ వార్ తదితర పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సీనియర్ క్రీడాకారులు యాదండ్ల నర్సయ్య, తోట పోచన్న, మాదాసి గోపాల్, గో వర్ధన్‌ను సన్మానించారు. కార్యక్రమంలో పీడీలు రాజ్ మహ్మ ద్, బండి రవి, చాంద్‌పాషా, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగ రామన్న, ప్రధాన కార్యదర్శి కంటేవాడ నగేశ్, కోశాధికారి కజ్జం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


