రక్తదానానికి ముందుకు రావాలి | - | Sakshi
Sakshi News home page

రక్తదానానికి ముందుకు రావాలి

Sep 20 2026 1:39 AM | Updated on Sep 20 2026 1:39 AM

మంచిర్యాలటౌన్‌: రక్తదానానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌ అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన శిబిరం కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి నుంచి రక్తదాన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అక్టోబర్‌ 2వరకు రక్తదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా చేపట్టనున్నట్లు తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 1న రక్తదాన శిబిరాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్‌, రషీద్‌, అల్లాడి శ్రీనివాస్‌, నాందేవ్‌, పుట్ట సత్తయ్య, వెంకటేశ్వర్లు, డాక్టర్లు రమ్య, అమన్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా కార్యదర్శి చందూరి మహేందర్‌, తలసేమియా సికిల్‌సెల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, నర్సింగ్‌ సిబ్బంది, నర్సింగ్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement