ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. | - | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

Sep 20 2026 1:39 AM | Updated on Sep 20 2026 1:39 AM

బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం నో బ్యాగ్‌ డే సందర్భంగా విదార్థులు ఉత్సాహంగా గడిపారు. బ్యాగు లేకుండానే హాజరైన విద్యార్థులు తరగతి గదుల్లో హాజరు తర్వాత పేరెంట్స్‌, టీచర్‌ మీటింగ్‌ నిర్వహించారు. విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా బెల్లంపల్లి బజారు ఏరియా ఉన్నత పాఠశాలలో ఏకపాత్రాభినయం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, అంత్యాక్షరి నిర్వహించారు. కొందరు తబలా, కీబోర్డు వాయించి, పాటలు పాడి అలరించారు. జానపద, దేశభక్తి గీతాలపై నృత్యాలు చేశారు. దైనందిన చర్యకు భిన్నంగా విద్యార్థులు ఉల్లాసంగా, ఉత్సాహంగా నో బ్యాగ్‌ డేలో పాల్గొన్నారు. ఒకట్రెండు పాఠశాలల్లో నో బ్యాగ్‌ డే నిర్వహించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement