● జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ పరీక్షలు ● రూ.15వేలు చెల్లిస్తే చాలు ● కొన్ని స్కానింగ్‌ కేంద్రాల ఇష్టారాజ్యం ● ప్రత్యేక నిఘా పెడితేనే అబార్షన్లకు కట్టడి | - | Sakshi
Sakshi News home page

● జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ పరీక్షలు ● రూ.15వేలు చెల్లిస్తే చాలు ● కొన్ని స్కానింగ్‌ కేంద్రాల ఇష్టారాజ్యం ● ప్రత్యేక నిఘా పెడితేనే అబార్షన్లకు కట్టడి

Sep 20 2026 1:39 AM | Updated on Sep 20 2026 1:39 AM

● జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ పరీక్షలు ● రూ.15వేలు చెల్లిస్తే చాలు ● కొన్ని స్కానింగ్‌ కేంద్రాల ఇష్టారాజ్యం ● ప్రత్యేక నిఘా పెడితేనే అబార్షన్లకు కట్టడి

జిల్లాలోని స్కానింగ్‌ కేంద్రాల వివరాలు

వైద్య, ఆరోగ్య శాఖలో నమోదైనవి 55

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్నవి 4

ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్నవి 51

మంచిర్యాలటౌన్‌: ‘‘లింగ నిర్ధారణ పరీక్ష చేయడం, చేయించుకోవడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరం. క్రిమినల్‌ కేసులూ నమోదు చేస్తారు. పుట్టబోయేది ఆడా, మగ అని తెలియజేయకూడదు. అలా చేస్తే జైలు శిక్ష విధిస్తారు..’’ కానీ ఈ నిబంధనలు ఎవరూ పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రం మంచిర్యాలలోని కొన్ని స్కానింగ్‌ కేంద్రాల్లో డబ్బులు తీసుకుని పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అని చెప్పేస్తున్నారు. ఇటీవల బస్టాండ్‌ సమీపంలోని ఓ స్కానింగ్‌ కేంద్రంలో రూ.15వేలు తీసుకుని ఓ గర్భిణికి స్కానింగ్‌ చేసి ఆడశిశువు అని చెప్పగా.. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, జన్మభూమినగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్‌ చే యించారు. సదరు మహిళ పలు కారణాలతో ఆత్మహత్యాయత్నం చేయడంతో లింగనిర్ధారణ బాగో తం బయటకు పొక్కింది. ‘భ్రూణహత్యలు ఆపేద్దాం.. ఆడపిల్ల లను రక్షించుకుందాం..’ అనే నినా దంతో ప్రజల్లో అధికారులు అవగాహన కల్పిస్తుండగా.. స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకులతో జిల్లా వైద్యాధికారి సమీక్షిస్తూ పీసీపీఎస్‌డీటీ చట్టం అమలుపై హెచ్చరిస్తున్నా కొందరు అవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. లింగ నిర్ధారణ, పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో అబార్షన్లు జరుగుతుండడం జిల్లాలో ఆ డపిల్లల సంఖ్య తగ్గేందుకు కారణమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement