ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు

Sep 20 2026 1:39 AM | Updated on Sep 20 2026 1:39 AM

బెల్లంపల్లి: వినాయకుల నిమజ్జనం రోజున ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని రామగుండం పోలీసులు కమిషనర్‌ అంబర్‌కిషోర్‌ ఝా అధికారులను ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శనివారం రాత్రి ఆయన పట్టణంలోని పలు గణేష్‌ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జన ఏర్పాట్లపై తెలుసుకున్నారు. బెల్లంపల్లి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దావ స్వాతి, బెల్లంపల్లి రూరల్‌ సీఐ హనోక్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement