బెల్లంపల్లి: గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేసుకోవాలని డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. శనివారం సబ్‌కలెక్టర్ మనోజ్, మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి, ఇతర శాఖల అధికారులతో కలిసి బెల్లంపల్లి పోచమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు, విగ్రహాలు వచ్చే, బయటకు వెళ్లే మార్గాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ శోభాయాత్ర మార్గంలో రోడ్లపై గుంతలను పూడ్చి వేయాలని తెలిపారు. నిమజ్జన ప్రాంతంలో వెలుతురు ఉండేలా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. బెల్లంపల్లి రూరల్ సీఐ సీహెచ్.హనోక్, బెల్లంపల్లి టౌన్ ఎస్‌హెచ్‌ఓ కే.శ్రీనివాసరావు, తహసీల్దార్ కృష్ణ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
పోలీసుస్టేషన్ తనిఖీ
బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను డీసీపీ భాస్కర్ తనిఖీ చేశారు. కేసుల నమోదు, నిర్వహణ, పెండింగ్ కేసుల రికార్డులు పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. నేరాల నియంత్రణ, రోడ్డు భద్రతపై దృష్టి సారించాలని సూచించారు.


