జిల్లాలో స్కానింగ్ కేంద్రాలు నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అనే అంశాలతోపాటు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయా అని తెలుసుకునేందుకు, స్కానింగ్ కేంద్రాల పరిశీలనకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రోగ్రాం ఆఫీసర్‌తోపాటు ఐదుగురు పారామెడికల్ అధికారులతో కమిటీ వేసి ఐదు బృందాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 4, ప్రైవేటు ఆస్పత్రుల్లో 51 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయి. కమిటీ సభ్యులు ఆయా కేంద్రాల్లో రిజిష్టర్ల నిర్వహణ, లింగనిర్ధారణ వంటివి పరిశీలిస్తున్నా కొన్ని నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. గతంలో మహారాష్ట్రకు వెళ్లి లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకుని అబార్షన్లు చేసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలోనే లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తున్నట్లు బయటకు రావడం ఆందోళన కలిగిస్తోంది.


