సర్‌ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

సర్‌ వేగవంతం చేయాలి

Sep 20 2026 1:39 AM | Updated on Sep 20 2026 1:39 AM

నెన్నెల: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌, డీఈవో చంద్రయ్య అధికారులకు సూచించారు. శనివారం మండలంలోని కుశ్నపల్లి, ఆవుడం గ్రామాల్లో సర్‌ ప్రక్రియను పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు నోటీసులు అందజేయాలని బీఎల్‌ఓలకు సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు సరైన ఆధారాలతో ధ్రువపత్రాలు అధికారులకు సమర్పించాలని కోరారు. కుశ్నపల్లి, ఆవుడం పాఠశాలలను సందర్శించి పేరెంట్స్‌ మీటింగ్‌లో పాల్గొన్న తల్లిదండ్రులు, విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం, నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. కుశ్నపల్లిలో టస్సర్‌ మగ్గాలను పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. సమస్యలు తెలుసుకున్నారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంఈఓ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌ఐ సులోచన, జీపీఓ లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement