క్రీడలతో విద్యార్థుల్లో ప్రతిభ వెలికితీత | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో విద్యార్థుల్లో ప్రతిభ వెలికితీత

Sep 20 2026 1:33 AM | Updated on Sep 20 2026 1:33 AM

జైపూర్‌: క్రీడలతో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని ఏసీపీ వెంకటేశ్వర్‌ అన్నారు. మంచిర్యాల ఎస్జీఎఫ్‌ ఆధ్వర్యంలో కోటపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులంలో శని వారం అండర్‌–17 బాలుర జిల్లాస్థాయి వాలీబాల్‌ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఏసీపీ వెంకటేశ్వర్‌, సీఐ నవీన్‌కుమార్‌ పోటీలను ప్రారంభించగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదలను పెంపొందిస్తాయన్నారు. ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గురుకులం ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌, ఎంపీడీవో శ్రీపతిబాపు, తహసీల్దార్‌ వనజారెడ్డి, సర్పంచ్‌ కూన భాస్కర్‌, ఎస్జీఎఫ్‌ కార్యదర్శి ఎండీ.యాకూబ్‌, పీఈటీలు, పీఈడీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement