జన్నారం: మండల కేంద్రంలో ఇళ్లముందు ఉంచిన ఆటోలలో బ్యాటరీలు చోరీ చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 16న పొనకల్ గ్రామంలోని వినాయకనగర్ తహసీల్దార్ కార్యాలయం రోడ్డులో అద్దెకు ఉంటున్న ఎల్కపల్లి నరేశ్‌కు చెందిన ఆటో, సంబరాజుల రాజశేఖర్‌కు చెందిన ఆటో బ్యాటరీలు చోరీకి గురయ్యాయి. నరేశ్ ఫిర్యాదు మేరకు దర్యాప్తులో భాగంగా ధర్మారానికి చెందిన గడ్డి చంద్రశేఖర్, పొనకల్ వినాయకనగర్‌కు చెందిన ఎరుకల అరుణ్ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. చోరీ చేసిన రెండు బ్యాటరీలను విక్రయిస్తుండగా చంద్రశేఖర్‌ను శనివారం అరెస్టు చేసి లక్సెట్టిపేట కోర్టుకు తరలించామని, మరో నిందితుడు అరుణ్ పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు.


