కాసిపేట: జిల్లాలో గతేడాది మండల విద్యావనరుల కేంద్రాల్లో (ఎంఆర్‌సీ) ఖాళీగా ఉన్న మెసెంజర్ పోస్టులకు నోటిఫికేషన్ వేసి 2025 ఆగస్టు 21న నియామకాలు చేపట్టారు. అందులో మంచిర్యాలలో తిరుపతి, కాసిపేటలో అంజనేయులు, వేమనపల్లి విద్యావనరుల కేంద్రంలో అశోక్‌ను నియమించారు. కిందిస్థాయి ఉద్యోగి అందులో కేవలం రూ.11వేలకు మండల విద్యావనరుల కేంద్రంలో ఫైల్స్ అందించడం మొదలు యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులు పాఠశాలలకు పంపిణీ చేయడం వాటి బాధ్యతలతో పాటు చివరకు కార్యాలయం శుభ్రంగా ఉంచడం లాంటి విధులు నిర్వహిస్తుంటారు. ముగ్గురూ గత విద్యాసంవత్సరం పూర్తి చేశారు. తిరిగి ఈ విద్యాసంవత్సరంలో ఐదు నెలలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఏడాదిగా వీరిని పట్టించుకునేవారు లేరు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తమ వేతనాలు అందించాలని కోరుతున్నారు.
ఏడాదిగా వేతనాలు లేవు
ఉద్యోగంలో చేరి ఏడాదవుతోంది. నేటికీ ఒక్క రూపాయి కూడా వేతనం ఇవ్వలేదు. అధికారులు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీలైనంత త్వరగా వేతనాలు చెల్లించి ఆదుకోవాలి.
– రత్నం తిరుపతి, మెసెంజర్, మంచిర్యాల


