శ్రీరాంపూర్: సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఎస్సార్పీ 1గనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఎన్నికలు నిర్వహించేంత వరకు రిజిస్టర్ కార్మిక సంఘాలన్నింటికీ యాజమాన్యం సమాన హోదా కల్పించాలని, కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో గెలిచిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేశాయన్నారు. సింగరేణి లాభాల ను ప్రకటించి కార్మికులకు వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు టీబీజీకేఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, కేంద్ర కమిటీ నాయకులు పెట్టం లక్ష్మణ్, పానుగంటి సత్తయ్య, బ్రాంచ్ నాయకులు వెంగళకుమారస్వామి, బుస్స రమేశ్, తొంగల రమేశ్, రవీందర్‌రెడ్డి, తిరుపతిరావు, నీలం సదయ్య, మైన్స్ కమిటీ నాయకులు కురుమ వికాస్, మేడం తిరుపతి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.


