మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఈ ఏడాది 15 పీజీ మెడికల్ సీట్ల కేటాయింపు కోసం జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) సభ్యులు శుక్రవారం మెడికల్ కాలేజీ, మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ (ప్రసూతి, సీ్త్రల వ్యాధులకు) సంబంధించి అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. గుడిపేట్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విద్యార్థులకు సరిపడేలా ల్యాబ్‌లు, తరగతి గదులు, మౌలిక సదుపాయాలు సీట్ల కేటాయింపునకు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించారు. 15 సీట్లలో 5 జనరల్ మెడిసిన్, 5 గైనకాలజీ, 5 పీడియాట్రిక్‌లలో సీట్లు మంజూరు చేసేందుకు అవకాశం ఉంది. కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ దేవోజి మాలోతు, మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్, ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీధర్, వైద్యులు పాల్గొన్నారు.


