మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవో హౌసింగ్ కాలనీలో ప్రతిష్టించిన సిద్ధి వినాయకుడికి శుక్రవారం టీఎన్‌జీవో నాయకులు అగ్గిపెట్టెలో పట్టే బంగారపు జరీపట్టు శాలువా సమర్పించారు. టీఎన్‌జీవో అటవీశాఖ సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు పొన్నం మల్లయ్య మాట్లాడుతూ సిరిసిల్ల చేనేత కార్మికులు ప్రత్యేకంగా నేసిన బంగారపు జరీపట్టు శాలువను గణేశుడికి సమర్పించినట్లు పేర్కొన్నారు. టీఎన్‌జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గడియా రం శ్రీహరి, పొన్న స్వప్న, హనుమండ్ల విమల, రఘునాథ్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు గుండేటి యోగేశ్వర్, నాగేశ్వర్ రావు, హనుమంత్ రావు, బా పురావు, మొండయ్య, శ్రావణ్‌కుమార్, రామ్మోహ న్, సతీశ్ కుమార్, తిరుపతిరెడ్డి, సునీత, సత్యనారా యణ, రాంకుమార్, రాజేందర్, ఉషన్న, టీఎన్‌జీవోస్ కాలనీ నాయకులు పాల్గొన్నారు.


