బెల్లంపల్లి: విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటాలని డీఐఈవో అంజయ్య అన్నారు. శుక్రవారం బెల్లంపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కాసిపేట బా లుర గురుకుల పాఠశాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లా అండర్ –19 ఎస్‌జీఎఫ్ జోనల్ స్థాయి వాలీ బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలను ఆయన ప్రా రంభించారు. ఆయన మాట్లాడుతూ చదువుతో పా టు విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలన్నా రు. బెల్లంపల్లి రూరల్ సీఐ సీ.హెచ్ హనోక్ మాట్లాడుతూ ఆటలో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలన్నారు. ఎస్‌జీఎఫ్ సెక్రటరీ బాపురావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు ఎంపిక పోటీలకు హా జరయ్యారని, 12 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్, పీడీ హరీష్, పీఈటీ రాజేందర్, పీడీలు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.


