జీవో3 రద్దుపై ఎమ్మెల్యే గళం | - | Sakshi
Sakshi News home page

జీవో3 రద్దుపై ఎమ్మెల్యే గళం

Sep 19 2026 6:20 AM | Updated on Sep 19 2026 6:20 AM

ఉట్నూర్‌రూరల్‌: షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గిరిజనుల హక్కుల పరిరక్షణకు, ప్రత్యేక అవకాశాల పునరుద్ధరణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే, నిర్మల్‌ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు శాసనసభలో డిమాండ్‌ చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ... జీవో నెం. 3తో పాటు సుమారు 29 రకాల జీవోల రద్దు వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన యువత విద్య, ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ తరహాలోనే తెలంగాణలోనూ షెడ్యూల్డ్‌ ప్రాంత ఆదివాసీ యువతకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో దీర్ఘకాలంగా వేధిస్తున్న ఫారెస్ట్‌, రెవెన్యూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. విద్యుత్‌ స్తంభాల మార్పిడి, పారిశు ద్ధ్యం, సులభతరంగా రెవెన్యూ సర్టిఫికెట్ల జారీ వంటి సమస్యలను పరిష్కరించి గిరిజనులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని సభ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement